దళారీ వ్యవస్థకు చెక్.. సోలార్ వెలుగులలో జిగేల్ మననున్న “పెద్ద చెరువు “ఊరకుంట” పక్కా భవనాల మంజూరు కోసం అందిన దరఖాస్తు హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా మత్స్యకారులు

Spread the love

దళారీ వ్యవస్థకు చెక్.. సోలార్ వెలుగులలో జిగేల్ మననున్న “పెద్ద చెరువు “ఊరకుంట”

పక్కా భవనాల మంజూరు కోసం అందిన దరఖాస్తు

హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా మత్స్యకారులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి మార్చి 24 (సంచలన వార్త)

ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ 1982లో బైలాలో నమోదు అయ్యి 148 మంది సభ్యులతో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ నాయకులు పెట్టుబడుదారులు రంగ ప్రవేశం చేసి లీజుకు తీసుకో ని మత్స్యకారుల సంపదను కొల్లగొట్టడం ప్రారంభించి అనధికారికంగా ఈ సంఘంలోని కొందరు వ్యక్తులకు వాటాలు పంచి వంచనకు గురి చేశారు. ఈ నేపథ్యంలో ఆనాడు పందిళ్లపల్లి గ్రామానికి చెందిన కొందరికి నూతన సభ్యత్వాలు నాటి ప్రభుత్వం కల్పించిందని న్యాయబద్ధంగా మత్స్యకారులకు దక్కాల్సిన హక్కులపై దిక్కులు పిక్కటిల్లేలా నిలదీసిన నేపథ్యంలో అవినీతి అక్రమాలకు అప్పటికే అవినీతి అక్రమాలకు పాల్పడే కొందరు పందిళ్ళపల్లి సీనియర్ మత్స్యకారులపై కక్ష కట్టి వేధింపులకు గురి చేశార ని కూ లి నాలి చేసుకునే పేదలు మధ్యతరగతి వర్గాలపై ఆనాటి నుండి ఇటీవల కాలం వరకు వివక్షత కొనసాగిందని సీనియర్ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.కాలక్రమైనా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జీవోలను సవరణ లు చేస్తూ గత ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్ద పీట వేసింది. దీంతో వారసత్వంగా ఉన్న హక్కుల కోసం ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తూ టిపల్లి వీరభద్రం సింగారపు వీరభద్రం వీరమల్లు తదితరులు సుమారు సంవత్సరం శ్రమించి జిల్లా రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో హక్కుల సాధన జరుగుతున్న అన్యాయం వివక్షతపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం కలిసి తమ గోడును వెళ్లబు చ్చుకున్నారు. దీంతో స్పందించిన మల్లన్న న్యాయమైన హక్కుల సాధన కోసం అండగా నిలిచారని మత్స్యకారులు తెలిపారు.

కాంట్రాక్టర్ వ్యవస్థకు చెక్

సోలార్ కాంతులతో వెలిగిపోనున్న పెద్ద చెరువు

మత్స్యకారుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి మత్స్య సొసైటీ పాలకవర్గం మరియు సభ్యులు దళారీ (కాంట్రాక్టర్) వ్యవస్థకు ముగింపు చెప్తూ తీర్మానం చేసి ఆమోదించి జిల్లా మత్స్య శాఖ సహాయ సంచాలకులకు సోమవారం అందించారు. అదేవిధంగా చేపలను సంరక్షించుకునేందుకు (కాపాడుకునేందుకు) పెద్ద చెరువు తో పాటు మిగతా మూడు కుంటలలో గస్తి కాసేందుకు సోలార్ విద్యుత్తు ప్లాంట్ లు మంజూరు చేయాలని వాతావరణ పరిస్థితులు అనుకూలించని సమయంలో మత్స్యకారులు కాపలాదారుడలు తలదాచుకునేందుకు పక్కా భవనాలు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం లో మత్స్యకారులు ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ మేరకు స్పందించిన మత్స్య శాఖ సహాయ సంచాలకులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తానని హామీ ఇచ్చారు.