చెరువు శిఖంలో దర్జాగా ఆక్రమణలు..
అక్రమ దందాలకు వంత పాడుతున్న అధికారులు..?
కన్నెత్తి చూడని నీటిపారుదల శాఖ అధికారులు
చేతులు మారుతున్న లక్షలాది రూపాయలు.. పట్టించుకోని యంత్రాంగాలు
ఓ తాహ సిల్దార్ కార్యాలయానికి కూత వేటు దూరంలో అక్రమ వెంచర్ల నిర్మాణం
(సంచలన వార్త ప్రత్యేక ప్రతినిధి) స్పెషల్ ఫోకస్ మార్చి 29
ఖమ్మం జిల్లా కేంద్రానికి సమీపంలోని ఓ మండల తాహసిల్దార్ కార్యాలయముకు కూత వేటు దూరంలో ఓ చెరువును ఆక్రమించి దర్జాగా డిటిపిసి అనుమతులు కొంతమేర పొంది దండిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించి కోట్లు వెనకేసుకున్న నేపథ్యం. ఇదే ప్రాంతంలో మరో వెంచర్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమంగా వెంచర్నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. అయితే ప్రాంతంలో చెరువును ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహించి కోట్లు వెనకేసుకోని మరికొంత సుమారు 2:30 ఎకరాలు ఆక్రమించగా అదే ప్రాంతంలో అదే చెరువు శిఖం భూమిని మరో బడా బాబు ఆక్రమించి దర్జాగా ఫెన్సింగ్ నిర్మాణం చేసినప్పటికీ సంబంధిత నాటి నేటి రెవెన్యూ అధికారులు నోరు మెదకపోవడం వెనక అనేక ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ ఇరిగేషన్ పంచాయతీరాజ్ సుడా అధికారులు స్పందించి చెరువు శిఖం భూములను పరిరక్షించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వెంచర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు మండల ప్రజలు స్థానికులు కోరుతున్నారు.
మరికొన్ని సమగ్ర ఆధారాలతో… అధికారుల వివరణలతో రేపటి కథనం 2లో… వేచి చూడండి…!