బడిబాటకి అమావాస్య అడ్డు పాఠశాలలో మొదటిరోజు తగ్గిన హాజరు శాతం

Spread the love

బడిబాటకి అమావాస్య అడ్డు

పాఠశాలలో మొదటిరోజు తగ్గిన హాజరు శాతం

డోర్నకల్ ప్రతినిధి జూన్ 15 సంచలన వార్త:
రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సోమవారం తెరుచుకున్నాయి.సెలవుల్లో ఆటపాటలతో సందడి చేసిన చిన్నారులు పాఠశాలలకి వెళ్లాలి అనేసరికి అమావాస్య అడ్డు తగిలింది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అమావాస్య అని, తమ పిల్లలను మంచి రోజు చూసి పాఠశాలలకు పంపించాలని సోమవారం పిల్లలను బడికి పంపడానికి ఇష్టపడలేదు.దీనితో పాఠశాలకు వచ్చే విద్యార్థుల హాజరు శాతం తగ్గింది.మొదటిరోజు ఈ విధంగా పాఠశాల మొదలు కావడం గమనార్హం.