తొలి రోజే ప్రభుత్వ పాఠశాలకు తాళం
రోడ్డుపై వేచియున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు
కాంట్రాక్టర్ కు బిల్లులు రాకపోవడమే ప్రధాన కారణం
డోర్నకల్ ప్రతినిధి జూన్ 15 సంచలన వార్త:
తొలిరోజే ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన ఘటన డోర్నకల్ మండలం సంకిసా గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రభుత్వ పాఠశాలకు తొలి రోజే ప్రధాన గేటుకు ఓ కాంట్రాక్టర్ తాళం వేసి నిరసన తెలిపారు.మన ఊరు మనబడి కార్యక్రమం కింద రెండేళ్ల క్రితం తాను చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన 33 లక్షలు బిల్లును ప్రభుత్వం చెల్లించలేదంటూ పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేయడంతో గ్రామంలో చర్చనీయంగా మారింది.గత సంవత్సరం కూడా ఇదే పాఠశాలలో బిల్లులు రాలేదు అంటూ ఇదే కాంట్రాక్టర్ పాఠశాల కు తాళం వేసి హల్చల్ సృష్టించారు.మళ్లీ ఇప్పుడు పాఠశాల ప్రారంభం రోజా తాళం వేయడంతో పాఠశాలకు వచ్చిన విద్యార్థులు,ఉపాధ్యాయులు మండుటెండల్లో గేటు బయటే నీరిక్షించారు.పోలీస్ లు రంగా ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది.నిరుపేద విద్యార్థుల వెళ్లే పాఠశాల కు తాళం వెయ్యడంతో విద్యార్థుల తల్లిదండ్రులు,గ్రామస్తులు మండిపడుతున్నారు.కాంట్రాక్టర్ బిల్లలు రావాలంటే ప్రభుత్వంతో పోరాడాలి కానీ నిరుపేద విద్యార్థులు వచ్చే పాఠశాలకు తాళం వెయ్యడమేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కాంట్రాక్టర్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు.