అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఫేర్వెల్ పార్టీ వేడుకలలో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

Spread the love

 

సికింద్రాబాద్ , ఓయూ పేజీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విద్యార్థుల ఫేర్వెల్ పార్టీ సమావేశంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి నియోజకవర్గము ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఒక లక్ష్య సాధన కోసం చేరి ఒక ఆయుధంలా తయారై సమాజానికి ఉపయోగపడతాడని కొనియాడుతూ ఆ ఘనత భారతదేశంలో ద్వితీయ స్థానంలో పేరుగాంచిన అంబేద్కర్ యూనివర్సిటీకి దక్కిందని అందుకు నిరంతరం కృషి చేస్తున్న ప్రొఫెసర్ కి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజేష్ గారికి, మోహన్ గారికి, కిరణ్ గారికి, అనంతలక్ష్మి గారికి,అనుపమ గారికి, మరియు కార్యక్రమానికి సహకరించిన తోటి విద్యార్థిని విద్యార్థులందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ యొక్క ఫేర్వెల్ పార్టీ వేడుకల్లో ప్రథమ, ద్వితీయ విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *