ఆప్‌కు బిగ్ షాక్.. ఢిల్లీ మంత్రి రాజీనామా..

Spread the love

కేజ్రీవాల్ అరెస్ట్‌తో కోలుకోలేని స్థితిలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిపై అసంతృప్తితో ఢిల్లీ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ బుధవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. రాజ్ కుమార్ ఆనంద్ పటేల్ నగర్ ఎమ్మెల్యే. అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ, ఎస్సీ,ఎస్టీ మంత్రిగా ఉన్నారు.

 

తన పదవికి రాజీనామా చేసిన వెంటనే ఆనంద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జరుగుతున్న ‘అవినీతి’తో తన పేరును ముడిపెట్టలేకే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశానని అన్నారు.

 

‘ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టింది అవినీతిపై పోరాడడానికే కానీ నేడు ఆ పార్టీ అవినీతి ఊబిలో కూరుకుపోయిందని, మంత్రి పదవిపై పనిచేయడం కష్టంగా మారింది. ఈ అవినీతితో పేరును కలపండం ఇష్టం లేకే మంత్రి పదవికి, పార్టీకి రాజీనామా చేశాను,’ అని ఆనంద్ అన్నారు.

 

“ఆమ్ ఆద్మీ పార్టీ దళిత ఎమ్మెల్యేలను, కౌన్సిలర్లను, మంత్రులను గౌరవించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దళితులంతా మోసపోయారు. మనం సమ్మిళిత సమాజంలో జీవిస్తున్నాం, కానీ నిష్పత్తి గురించి మాట్లాడటం తప్పు కాదు. వీటన్నింటితో నేను పార్టీలో కొనసాగడం కష్టం, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా. నిన్నటి వరకు, మమ్మల్ని ఇరికిస్తున్నారనే భావనలో ఉన్నాము. కానీ హైకోర్టు తీర్పు తర్వాత, ఏదో ఉన్నట్లు అనిపిస్తుంది.” అని రాజ్ కుమార్ ఆనంద్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *