శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

Spread the love

 

సంగారెడ్డి జిల్లా, తాటిపల్లి గ్రామంలోని శ్రీరామ మందిరంలో భక్త బృంద కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి జ్యోతి, రిటైర్డ్ నేవీ ఆఫీసర్ కమలాపురం హరిశంకర్ గౌడ్ సతీమణి ఉమారాణి మరియు భక్త బృందం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ కనివిని ఎరుగని రీతిలో సాంప్రదాయ బద్ధంగా శ్రీరాముని వేడుకలను తాటిపల్లి శ్రీరామ మందిరం దేవాలయ కమిటీ భక్తులు సంస్కృతి బద్దంగా, భక్తిశ్రద్ధలతో ,యజ్ఞ యగాలతో శ్రీరాముడి కళ్యాణాన్ని నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఇలాంటి వేడుకలను భక్తులందరితో కలిసి జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని నెలకొల్పిందని తెలియజేశారు. అదేవిధంగా శ్రీరాముడు అంటే రామరాజ్యం , శ్రీరాముడి పరిపాలన, రామాయణం అందరికీ గుర్తొస్తుందని తెలియజేస్తూ తద్వారా రామరాజ్యం పరిపాలన విధానాన్ని నేర్పుతోందని, మరియు రామాయణం జీవన విధానాన్ని నేర్పుతుందని యావత్ భారత దేశ ప్రజలందరూ గుర్తించదగ్గ విషయమని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో తాటిపల్లి శ్రీరామ మందిరం భక్త బృందం ముఖ్య కమిటీ సభ్యులు మరియు శ్రీరాముని కళ్యాణ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *