BRS ఆఫీస్ నుంచే అంతా జరిగింది.. జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ..

Spread the love

మండోలి జైలు నుంచి సుఖేష్ చంద్రశేఖర్ మరో లేఖ రాశాడు. గతంలో జరిగిన నెయ్యి డబ్బాల వ్యవహారంపై లేఖలో పేర్కొన్నాడు. అరవింద్ కేజ్రీవాల్, కవిత, సత్యేంద్ర జైన్ ల గురించి కూడా అందులో ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రికి లేఖ ద్వారా ఫిర్యాదు చేశాడు.

 

నెయ్యి కోడ్ లాంగ్వేజ్ ద్వారానే ముడుపులు చేతులు మారాయని లేఖలో ప్రస్తావించాడు. అయితే, నగదు సేకరణ మొత్తం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం నుంచి జరిగిందని, కవిత సహకారంతోనే ఈ వ్యవహారమంతా జరిగిందని, ఇందుకు సంబంధించిన అతని వద్ద ఆధారాలు ఉన్నాయంటూ సుఖేష్ తెలిపాడు.

 

కవిత, అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్, తన మధ్య జరిగిన వాట్సాప్ చాట్ కు సంబంధించి కొన్ని స్క్రీన్ షాట్లను మీకు జత చేసి పంపిస్తున్నానంటూ హోం శాఖకు రాసిన లేఖలో సుఖేష్ చంద్రశేఖర్ పేర్కొన్నాడు.

 

కవిత ప్రస్తుతం కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఈ స్క్రీన్ షాట్లను జతపరుస్తున్నానన్న సుఖేష్ చంద్రశేఖర్.. అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ నేతృత్వంలోని ఆప్ సిండికేట్‌కు సంబంధించి తన దగ్గర ఉన్న పూర్తి సాక్ష్యాలతో తన సహకారాన్ని అందిస్తానంటూ సుఖేష్ చంద్రశేఖర్ లేఖలో ప్రస్తావించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *