యూఎస్ మానవ హక్కుల నివేదిక.. భారత్ తీవ్ర అభ్యంతరం..

Spread the love

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందంటూ అమెరికా ఇచ్చిన నివేదికపై భారత విదేశాంగ శాఖ అభ్యంతరం తెలిపింది. మణిపూర్‌ అల్లర్ల తర్వాత దేశంలో పెద్ద ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా ఓ నివేదిక విడుదల చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

 

అమెరికా పూర్తిగా పక్షపాత వైఖరితో నివేదిక ఇచ్చిందని భారత్ దుయ్యబట్టింది. అమెరికా ఇచ్చిన నివేదికకు ఎలాంటి విలువ లేదని తెలిపింది. గురువారం మీడియా సమావేశంలో మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైశ్వాల్‌ ఈ అంశం గురించి ప్రస్తావించారు. భారత్‌ ను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నారో ఈ నివేదిక ద్వారా అర్థమవుతోందని తెలిపారు.

 

అందుకే అమెరికా నివేదికకు తాము ఎలాంటి విలువ ఇవ్వడం లేదని తెలిపారు. మానవ హక్కుల విధానాలపై అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా వార్షిక నివేదికను విడుదల చేసింది. ఇందులో మణిపుర్‌ అల్లర్లను ప్రస్తావించింది. అయితే ఈ సమయంలోనే భారత్ లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని పేర్కొంది.

 

మణిపూర్ ఘటనలను ప్రధాని మోదీ సిగ్గుచేటని అభివర్ణించడంతో పాటు..వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు వెల్లడించింది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మానవ హక్కులకు సంబంధించిన అంశాలను సైతం ఇందులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *