హనుమాన్ ర్యాలీలో ఉద్రిక్తత, కత్తితో ఓ వ్యక్తి హంగామా..!

Spread the love

కరీంనగర్ జిల్లా మంచిర్యాల టౌన్ జంక్షన్‌లో చేపట్టిన హనుమాన్ శోభాయాత్ర ఉద్రిక్తతకు దారి తీసింది. యాత్రలోకి ఓ వ్యక్తి కత్తితో ప్రవేశించి గందరగోళం సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు, అతడ్ని అదుపులోకి తీసుకునే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ వ్యక్తిని తమకు అప్పగించాలని హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసు పెట్రోలింగ్ వాహనంపై దాడి చేశారు. పరిస్థితి గమనించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అసలేం జరిగిందంటే..

 

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని హనుమాన్ టెంపుల్ నుంచి గాంధీ రోడ్‌లోని ఆంజనేయ దేవాలయం వరకు శోభాయత్ర ప్రారంభించారు హనుమాన్ భక్తులు. ప్రశాంతంగా జరుగుతున్న ర్యాలీలో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రవేశించాడు. అంతేకాదు డ్యాన్సులు చేయడం మొదలుపెట్టాడు. అతడ్ని హనుమాన్ భక్తులు అడ్డుకున్నారు. దీంతో ఆ యువకుడు- హనుమాన్ భక్తుల మధ్య వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఘర్షణ జరుగుతున్న సమయంలో పెట్రోలింగ్ వాహనంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు.

 

యవకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించే ప్రయత్నంలో హనుమాన్ భక్తులు పోలీసు వాహనాన్ని వెంబడించారు. ఓ భక్తుడు వాహనం పట్టుకుని వేలాడాడు. కొద్దిదూరం వెళ్లాక పోలీసులు వాహనాన్ని ఆపారు. కోపోద్రిక్తులపై ఆంజనేయ భక్తులు పోలీసు వాహనం అద్దాలను ధ్వంసం చేశారు. చివరకు యువకుడ్ని స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే బీజేపీ నాయకులు మూడో నెంబర్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఎట్టకేలకు పరిస్థితి సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *