ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న విజయం

Spread the love

తెలంగాణలో హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిపై 19,375 ఓట్ల ఆదిక్యంలో మల్లన్న ఉన్నారు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మేజిక్ ఫిగర్ రాకపోవడంతో అతడిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. కాసేపట్లో అధికారులు తుదిఫలితం ప్రకటించనున్నారు. మల్లన్న గెలుపు ఖాయమవడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

 

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంది. మొత్తం అభ్యర్థుల్లో 47 మందిని ఎలిమినేషన్ ప్రక్రియలో తొలగించారు. స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్, బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ కూడా ఎలిమినేట్ అయ్యారు. 47 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేసిన తర్వాత తీన్మార్ మల్లన్నకు అత్యధిక మెజారిటీ ఉంది. గెలుపు కోసం కావాల్సిన ఓట్లు లేకపోవడంతో రాకేష్ రెడ్డిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది.

 

మెజారిటీ తీన్మార్ మల్లన్నకు రావడంతో కౌంటింగ్ సెంటర్ వద్దకు భారీగా కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు చేరుకుంటున్నారు. బాణసంచా పేల్చుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *