నాగపూర్‌లో భారీ పేలుడు.. ఐదుగురి మృతి..

Spread the love

నాగ్‌పూర్‌లోని ఓ పేలుడు పదార్థాల తయారీ కర్మాగారంలో గురువారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మరణించగా.. మరో ఐదుగురు గాయపడ్డారు.

 

గాయపడ్డవారిలో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికి పోలీసులు తెలిపారు. హింగ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని ధామ్నా గ్రామంలో చాముండి ఎక్స్ ‌ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కార్మికులు పేలుడు పదార్థాలను ప్యాక్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్లు పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *