సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో పూర్వకాలంలో మహా శక్తివంతమైన క్షేత్రంగా వెలసిన దుర్గ భవాని మాతను దర్శించుకున్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ దుర్గ భవాని మాతను వేడుకుంటూ మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి చల్లంగా చూడాలని వేడుకున్నారు, అదేవిధంగా సంగారెడ్డి నియోజకవర్గము అభివృద్ధి చెందడానికి శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారిని కలిసి సంగారెడ్డి జిల్లా ప్రజలకు సంపూర్ణ న్యాయం చేస్తానని తెలియజేశారు. ఈ యొక్క ఆషాడ మాస జాతర వేడుకలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.