ఆరోగ్యశ్రీ చికిత్స ధరలను సవరించిన ప్రభుత్వం..

Spread the love

రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది. 1,375 ప్యాకేజీల ధరలు సవరిస్తూ జీవో 30ని తాజాగా విడుదల చేసింది. మిగిలిన 297 ప్యాకేజీ ధరల్లో ఎటువంటి మార్పు లేదని అందులో స్పష్టం చేసింది.

 

ఇదిలా ఉంటే.. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి రూ. 25 వేల పెన్షన్ అందించనున్నది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. కనుమరుగు అవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్ తరాలకు అందించే కళాకారులను ప్రోత్సహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

 

కాగా, ఇటీవల పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెలా రూ. 25 వేల ప్రత్యేక పెన్షన్ ను మంజూరు చేస్తూ జీవోను జారీ చేశారు. అంతేకాకుండా.. పద్మ విభూషన్, పద్మశ్రీ పురస్కార విజేతలకు సన్మాన కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు రూ. 25 వేల పింఛన్ ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇచ్చిన మాటకు కట్టుబడి తాజాగా ఉత్తర్వులు జారీ చేశామంటూ మంత్రి పేర్కొన్నారు. భాష, సాంస్కృతిక శాఖ ద్వారా వీరికి పెన్షన్ డబ్బులు నేరుగా వారి అకౌంట్లలో ప్రభుత్వం జమ చేయనున్నదని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *