రైతుల కంట్లో కారం కొట్టిన. ఆ రియల్ ఎస్టేట్ అధికారులు
లిఫ్టును అడ్డం పెట్టుకొని. ప్రభుత్వ కాలువలతో వ్యాపారం.
అంట కాగి.. ఖరీదైన భవనాలలో విశ్రాంతి..
కోదాడ నియోజకవర్గంలోని దుర్గాపురం లో కాలువలు మాయం చే సిన ఆ ఎంపీడీవోలు..?
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో.. అధికారుల భాగస్వామ్యం తో కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్లు…?
*ప్రభుత్వ సేవలు మరిచారు..? ప్రభుత్వ సొమ్మును ఒడిసిపట్టి కోట్లు వెనకేసుకున్నారు కదా..!
(స్టేట్ బ్యూరో ప్రతినిధి ప్రత్యేక కథనం1 మార్చి 23 సంచలన వార్త)
అవును… అవును.. నిజమే.. కదా అంటున్నా రైతులు స్థానికులు..
నాటి ప్రభుత్వ హయాంలో ముచ్చటగా ముగ్గురు అధికారులు సూర్యాపేట జిల్లా దుర్గాపురం మసీదు ఎదురుగా ఉన్న ఎన్ఎస్పి కాలువను ధ్వంసం చేసి దుర్గాపురం మసీదు ఎదురుగా తమ్మరకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏకంగా రోడ్డు వేశారని ప్రత్యక్షంగా కనపడుతుంది. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన కొందరు అధికారులు వ్యవస్థలను మేనేజ్ చేసి విలాసవంతమైన భవనాలు నిర్మించుకొని అవినీతి సొమ్ముతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంతో పరిచయాలు పెంచుకొని తమ అవినీతి కోటలను పదిలం చేసుకుంటున్నారనేది బహిరంగంగా తెలిసిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులు వ్యాపారం చేసిన తర్వాత జాగ్రత్తలు పడుతున్నట్లు సంచలన వార్త సమగ్ర ఆధారాలు సేకరించింది.. అధికారుల వివరాలుతోపాటు మరికొన్ని
వివరాలతో.. తరువాయి భాగంలో. !