మట్టంపల్లి గ్రామంలో దళిత బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి* *తల్లమల్ల హసేన్* *ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్*

Spread the love

*మట్టంపల్లి గ్రామంలో దళిత బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి*
*తల్లమల్ల హసేన్*
*ఎస్సీ, ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్*
సూర్యాపేట జూన్ 25( సంచలన వార్త సూర్యాపేట జిల్లా బ్యూరో) ‍ ‍ ‍ ‌ ‍ ‍ హుజూర్నగర్ నియోజకవర్గం మట్టంపల్లి గ్రామంలో గత మే నెల ఒకటవ తేదీ రాత్రి గ్రామానికి చెందిన దళిత యువకుడు తుపాకుల మహేష్ గారిపై దాడి చేసి హత్య ప్రయత్నం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ నమోదు తో పాటు బిఎన్ఎస్ యాక్ట్ 109/ 307 కేసు నమోదు చేయాలని ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ తల్లమల్ల హసేన్ రాష్ట్ర కన్వీనర్ డప్పు మల్లయ్య డిమాండ్ చేశారు. గురువారం రోజు మధ్యాహ్నం మట్టంపల్లి గ్రామంలో దళిత బాధితుల కుటుంబాలను ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిప్పలపల్లి చిరంజీవి సూర్యాపేట జిల్లా ఎస్సీ ఎస్టీ న్యాయవాదుల అసోసియేషన్ కన్వీనర్ నాగరాజు రత్నావత తో కలిసి బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుజూర్నగర్ కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాలలో గత కొంతకాలంగా దళితుల మీద దాడులు జరగటం పరిపాటి అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బాధితులు తమపై దాడి చేసిన వారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీస్ అధికారులు ఫిర్యాదులను పట్టించుకోవడం లేకుండా దళితుల మీద దాడి చేసిన వారి కౌంటర్ ఫిర్యాదులను తీసుకొని ఎలాంటి విచారణ చేయకుండా బాధితులపైనే కేసులు చేయడం విచారకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తనకంటూ పేరు ఉన్న సీనియర్ మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి నియోజకవర్గం లో దళితుల మీద ఇలాంటి దాడులు జరగటం విచారకరమని అన్నారు. గత ఏడు నెలల క్రితం కోదాడ నియోజకవర్గంలో కర్ల రాజేష్ లాకప్ డెత్ జరగటం మరియు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరపటం ఎందుకని ప్రశ్నించారు. కోదాడ మరియు హుజుర్నగర్ ఈ రెండు నియోజకవర్గాలలో దళితులు బతకటం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి దాడులు చేయని వారి పైన బి.ఎన్.ఎస్ యాక్ట్ 109 కేసు నమోదు చేసి వారి అరెస్టు చేయడం సబబు కాదని కాదని అన్నారు. పోలీస్ యంతాంగం సమగ్ర విచారణ జరిపి బాధిత దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరినారు ఈ సంఘటనకు మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి బాధ్యత వహించాలని సరియైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగారి నుండి దళిత బాధిత కుటుంబాలకు న్యాయం జరగకుంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉత్తంకుమార్ రెడ్డి పై ఉత్తమ పద్మావతి పై ఫిర్యాదు చేస్తామని అన్నారు.